Suresh Babu: సురేష్ బాబుకు ఆ సినిమాలతో సక్సెస్ దక్కుతుందా?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు పరిమితంగా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ బాబు బ్యానర్ నుంచి జూన్ నెలలో విడుదలైన విరాటపర్వం సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల సురేష్ బాబుకు భారీగా నష్టాలు వచ్చాయి. రిలీజైన రెండు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిందనే సంగతి తెలిసిందే. అయితే సురేష్ బాబు బ్యానర్ నుంచి కేవలం వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

సురేష్ సంస్థ భాగస్వామ్యంతో తెరకెక్కిన శాఖిని డాకిని సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. సురేశ్ బాబు బ్యానర్ పార్ట్ నర్ షిప్ లో తెరకెక్కిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా సెప్టెంబర్ 23వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. అయితే ట్రైలర్లు రిలీజైన తర్వాత పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

నారప్ప, దృశ్యం2 లాంటి భారీ సినిమాలను ఓటీటీకి ఇచ్చిన సురేష్ బాబు ఇప్పుడు మాత్రం థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కథల విషయంలో సురేష్ బాబు జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుందని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాలలో మెజారిటీ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సురేష్ బాబు రూటు మార్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సురేష్ బాబుకు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరుంది. తక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి లాభాలను సొంతం చేసుకునే నిర్మాతగా కూడా సురేష్ బాబు పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సురేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus