మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ ను ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆ మూవీ తెలుగులో డబ్ అయినప్పటికీ పృధ్వీ రాజ్ సుకుమారన్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ ను తీసుకోవడంతో ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ చేకూరింది. ఒరిజినల్ లో ఒకటి,అర పాటలు ఉంటాయి. తెలుగులో కూడా ఓ పాటను పెట్టారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రూపొందిన పాట ఇది.
ముంబైలో ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఈ పాటని చిత్రీకరించడం జరిగింది. ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన ఈ లిరికల్ సాంగ్ ను… కొంచెం ఆలస్యంగా బుధవారం నాడు విడుదల చేశారు. ఇద్దరు సూపర్ స్టార్లు చిందులేసిన పాట కావడంతో సిల్వర్ స్క్రీన్ పై ఈ పాటని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఏర్పడింది. అయితే ఈ పాట సినిమాలో ఉండదట. నిజంగా ఇది అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి.
కేవలం ఎండ్ టైటిల్స్ కు మాత్రమే ఈ పాట వాడుతున్నారట. కథ ప్రకారం.. సిట్యువేషన్ కు ఈ పాట మ్యాచ్ అవ్వకపోవడంతో చివర్లో పెట్టినట్టు తెలుస్తుంది. సినిమా అనేది బాగుంటే ఎండ్ టైటిల్స్ వద్ద వచ్చినా పాటను చూసే వెళ్తారు. ఒకవేళ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే పాటని చూడకుండానే జనాలు సీట్లలో నుండి వెళ్ళిపోతారు.
కాబట్టి ఇది డిజప్పాయింటింగ్ డెసిషన్ అవుతుంది. ‘పంజా’ దగ్గర్నుండి ‘2.ఓ’ ‘లైగర్’ ఇలా చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. చిరు, సల్మాన్ ఎంతలా స్టెప్పులేసినా పాటకి తగ్గ సిట్యుయేషన్ లేకపోతే ఇంకేం లాభం. కేవలం ప్రమోషన్ కోసం వాడుకున్నట్టు ఉంటుంది అంతే..!
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!