Sujeeth: మరో మెగా హీరోను నమ్ముకున్న సుజీత్.. కానీ?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా సాహో సినిమా మాత్రం డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది. సాహో ఫలితం తర్వాత సుజీత్ కు ఛాన్స్ ఇవ్వడానికి హీరోలు, నిర్మాతలు సాహసించడం లేదు. పవన్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరి రీమేక్ తెరకెక్కుతుందని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలు వార్తలుగానే మిగిలిపోయాయి.మరోవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రీజన్ వల్ల సుజీత్ వరుణ్ తేజ్ తో ఒక సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాలని సుజీత్ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. వరుణ్ తేజ్ కు ఇప్పటికే సుజీత్ లైన్ చెప్పగా ఆ లైన్ వరుణ్ తేజ్ కు ఎంతగానో నచ్చిందని సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వరుణ్ తేజ్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే సుజీత్ కు ఆఫర్లు పెరుగుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సాహో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు వచ్చిన టాక్ తో పోల్చి చూస్తే సినిమా మెరుగైన కలెక్షన్లనే సొంతం చేసుకుంది.

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన సుజీత్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. సుజీత్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాసినిమాకు సుజీత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus