ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్ ను అంచనాలను మించి మెప్పిస్తోంది. కల్కి 2898 ఏడీ మూవీ థర్డ్ వీకెండ్ లో కూడా కలెక్షన్ల పరంగా అదరొగొట్టిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఫ్యాన్స్ కల్కి సినిమాపైనే ప్రధానంగా దృష్టి పెట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి మూవీ సెకండాఫ్ లోని యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని ప్రభాస్, అమితాబ్ (Amitabh Bachchan) కాంబో సీన్స్ ను ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలని అనిపిస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అశ్వద్ధామ, భైరవ పాత్రలలో అమితాబ్, ప్రభాస్ నటించారని చెప్పడం కంటే జీవించారని చెప్పడం కరెక్ట్ అని చెప్పవచ్చు. బుజ్జి పాత్రను నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మూడు ప్రపంచాలను అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెరపై అద్భుతంగా చూపించడం నాగ్ అశ్విన్ కు మాత్రమే సాధ్యమైందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం మూడు సినిమాలు మాత్రమే 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను అందుకోగా ఆ మూడు సినిమాల్లో కల్కి 2898 ఏడీ సినిమా ఒకటి కావడం గమనార్హం.
కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని ప్రభాస్ మిర్చి సినిమాలో చెప్పిన విధంగా ప్రభాస్ కటౌట్ తో సినిమాలు విడుదలైతే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. స్టార్ హీరోలలో పభాస్ రికార్డులను క్రియేట్ చేయడంతో పాటు తను సాధించిన రికార్డులను తనే తిరగరాయడం ద్వారా ప్రశంసలను అందుకుంటూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరగడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
కల్కి సినిమా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను అందుకున్న నేపథ్యంలో ఈ ఏడాది రిలీజ్ కానున్న క్రేజీ సినిమాలలో ఆ మార్క్ ను క్రాస్ చేసే సినిమా ఏదనే చర్చ జరుగుతోంది. పుష్ప2, గేమ్ ఛేంజర్, దేవర సినిమాలలో మూడు సినిమాలకు ఆ ఛాన్స్ ఉండగా ఏ సినిమా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా ఏ సినిమా నిలుస్తుందనే చర్చ సైతం ఫ్యాన్స్ మధ్య జరుగుతోంది.