ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేయగల టాలీవుడ్ సినిమాల జాబితా ఇదే!

2024 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకం అనే సంగతి తెలిసిందే. గతేడాది చాలామంది యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు విడుదల కాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య మరి కొందరు క్రేజీ హీరోల సినిమాలు సైతం థియేటర్లలో విడుదల కానున్నాయి. చిరంజీవి సినిమా మాత్రం ఈ ఏడాది లేనట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న మహేశ్ గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్, తేజ సజ్జా హనుమాన్ సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నార్త్ లో హనుమాన్ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసిన నేపథ్యంలో హనుమాన్ రిలీజ్ డేట్ ను మార్చడానికి మేకర్స్ ఇష్టపడలేదు. ఎన్టీఆర్ దేవర, చరణ్ గేమ్ ఛేంజర్, బన్నీ పుష్ప2, పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్ ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాలయ్య బాబీ కాంబో మూవీపై సైతం అంచనాలు పెరుగుతున్నాయి. టైటిల్ ఫిక్స్ కాని మరికొన్ని సినిమాలు ఈ ఏడాది రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలలో చాలా సినిమాలు 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ ఏడాది షూటింగ్ మొదలుకానున్న (Mahesh) మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది విడుదలవుతున్న సినిమాలలో పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాయో చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus