ఈ సీక్వెల్ సినిమాలు బాహుబలి2 రేంజ్ లో మెప్పించడం సాధ్యమేనా?

బాహుబలి1 (Baahubali) కు సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి2 ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదలైనా అప్పట్లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం చాలా కష్టమైంది. బాహుబలి2 (Baahubali 2) మ్యాజిక్ ను పుష్ప2 (Pushpa 2) , కల్కి2 (Kalki 2) , దేవర2 (Devara) రిపీట్ చేయగలవా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతగానో జరుగుతుండటం గమనార్హం. ఈ సీక్వెల్ సినిమాలు బాహుబలి2 రేంజ్ లో మెప్పించడం సాధ్యమేనా అనే చర్చ సైతం అభిమానుల మధ్య జరుగుతోంది.

Pushpa 2

పుష్ప2 (Pushpa 2) ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా కల్కి2, దేవర2 రిలీజ్ కావడానికి మాత్రం మరికొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కల్కి2, దేవర2 సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలతో పాటు సలార్ సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సీక్వెల్ సినిమాలు హిట్ గా నిలిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల సీక్వెల్స్ దిశగా అడుగులు పడే అడుగులు పడే అవకాశాలు ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుండటం గమనార్హం. బాహుబలి2 కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా అప్పట్లోనే 1800 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏదనే చర్చ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. సీక్వెల్స్ సినిమాలకు బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుండటం గమనార్హం.

సీక్వెల్స్ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాహుబలి2 సినిమా కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసే మూవీ మహేష్ (Mahesh Babu) జక్కన్న (S. S. Rajamouli) కాంబో మూవీ మాత్రమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జనీకాంత్‌ అనారోగ్యం.. ‘కూలీ’కి లింక్‌ చేసేసరికి కోపమొచ్చింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus