తక్కువ టైంలోనే టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ (People Media) సంస్థ. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ‘ధమాకా’ (Dhamaka) వంటి హిట్లు ఇచ్చిన ఈ సంస్థ ఆ తర్వాత వరుసగా సినిమాలు నిర్మించడం మొదలు పెట్టింది. వంద సినిమాలు నిర్మించాలనే లక్ష్యంతో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు శ్రీకారం చుట్టింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రభాస్ (Prabhas) వంటి బడా హీరోలతో పాటు రవితేజ (Ravi Teja), గోపీచంద్ (Gopichand).. వంటి మిడ్ రేంజ్ హీరోలతో కూడా వరుస సినిమాలు నిర్మించింది.
అయితే 2024 లో ఈ సంస్థని వరుస ప్లాపులు వెంటాడాయి. హరీష్ శంకర్ (Harish Shankar) వంటి మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్లతో సినిమాలు చేసినా అవి బోల్తా కొట్టాయి. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తో చేసిన ‘బ్రో’ (BRO) కూడా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ‘పీపుల్ మీడియా’ సంస్థ ప్రభాస్ తో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) అనే భారీ బడ్జెట్ సినిమా నిర్మిస్తుంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారుతి (Maruthi Dasari) దర్శకుడు.
ఈ సినిమా కనుక హిట్ అయితే ‘పీపుల్ మీడియా’ వారు చాలా వరకు గట్టెక్కేసినట్టే. మరోపక్క సిద్ధు జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) ‘తెలుసు కదా’, అడివి శేష్ తో (Adivi Sesh) ‘గూఢచారి 2’ (Goodachari 2) వంటి క్రేజీ సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. వీటిపై మంచి బజ్ ఉంది. ఈ సినిమాలన్నీ హిట్ అయితే.. ‘పీపుల్ మీడియా’ వారు నష్టాల బారి నుండి బయటపడడం ఖాయమనే చెప్పాలి. ఏదేమైనా ఈ 2025 ‘పీపుల్ మీడియా’ వారికి చాలా కీలకమైనది.