Balakrishna: టాలీవుడ్‌ ఇప్పుడు యాక్టివ్‌ అవుతుందా? బాలయ్య కోసం సభ ఉంటుందా?

టాలీవుడ్‌లో ఐక్యత ఉంది. ఒకరికి ఏ ఆనందం వచ్చినా అందరూ సంతోషపడతారు. ఒకరి సినిమా విజయం సాధిస్తే మిగిలినవాళ్లు సంబరపడుతుంటారు. ఇందులో ఎంతవరకు నిజముందో మీకూ తెలుసు. పోటీ ప్రపంచంలో నడుస్తున్న సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితీ ఉంటే ఇక టాలీవుడ్‌కి తిరుగే లేదు. మరి అలానే ఉందా అంటే నో కామెంట్‌. హిట్లు, ఆనందాల వరకు ఓకే. దేశం గర్వించదగ్గ వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వం అత్యుతన్నత పురస్కారాలు ఇచ్చినప్పుడైనా టాలీవుడ్‌ ఆనందపడాలి కదా. గతంలో ఇలా జరిగింది కూడా.

Balakrishna

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. గతేడాది చిరంజీవికి టాలీవుడ్‌ నుండి దక్కని గౌరవం ఈ ఏడాది బాలకృష్ణకు దక్కుతుందా? అని. ఎందుకంటే భారతదేశంలో అత్యుతన్నత పురస్కారాల్లో రెండో స్థానంలో ఉండే పద్మ విభూషణ్‌ను కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు. అయితే ఈ ఆనందాన్ని టాలీవుడ్ పంచుకోలేదు. ట్వీట్లతో తెలుగు సినిమా జనాలు సరిపెట్టేశారు.

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేసి ఇది తెలుగు రాష్ట్రాల ఘనత అని చెప్పింది. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు సినిమా పరిశ్రమ ఆ దిశగా ఆలోచించలేదు. భారీ స్థాయిలో సభ పెడతాం, చిరంజీవి సాధించిన ఘనతను పండగ చేసుకుంటాం అని ఆ రోజుల్లో కొందరు సినీ పెద్దలు చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు బాలకృష్ణ విషయంలో ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

బాలయ్యకు ఈ పురస్కారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఆయనకు సన్మాన సత్కారాలు చేస్తుంది ఇది పక్కా. మరి టాలీవుడ్‌ ముందుకొస్తుందా? బాలయ్య మావాడు అంటూ బాజాలు కొడుతుందా అనేది చూడాలి. ఒకవేళ జరిగితే చిరంజీవికి ఎందుకు చేయలేదు అనే ప్రశ్న వస్తుంది. చేయకపోతే చిరంజీవికి చేయలేదు, బాలయ్యకూ చేయలేదు. అసలు పెద్ద హీరోలను గౌరవించుకోవడం మానేశారా అనే ప్రశ్న వస్తుంది.

అన్నట్లు చిరంజీవిని ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌ విదేశాల్లో సన్మానం చేసినట్లు గుర్తు. మరి ఇప్పుడు బాలయ్యకు ఎవరలా?

స్టార్ రైటర్ ఆల్ టైం రికార్డు..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus