సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తమ సినీ కెరీర్ లో వందల సంఖ్యలో సినిమాలలో నటించారనే సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి 150కు పైగా సినిమాలలో నటించి హీరోగా కెరీర్ ను కొనసాగిస్తుండగా బాలకృష్ణ 100కు పైగా సినిమాలలో నటించి కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నాగార్జున త్వరలో 100 మార్కును అందుకోనుండగా వెంకటేష్ ఈ మార్కును అందుకోవడం కష్టమేనని చెప్పవచ్చు. అయితే ఈ జనరేషన్ స్టార్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ సినీ కెరీర్ లో 50 సినిమాలు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ తెరకెక్కనుంది. పవన్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పవన్ 27వ సినిమా కావడం గమనార్హం. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ 25వ సినిమాగా తెరకెక్కనుంది. బన్నీ 21వ సినిమాగా పుష్ప ది రూల్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలకు ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతోంది.
టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఎవరైనా ఈ అరుదైన ఫీట్ ను సాధిస్తారేమో చూడాల్సి ఉంది. మరోవైపు టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టి తమ మార్కెట్ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీలకు ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. మహేష్, పవన్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తున్న నేపథ్యంలో వాళ్లకు కూడా పాన్ ఇండియా హీరోలుగా రాబోయే రోజుల్లో గుర్తింపు దక్కనుందని చెప్పవచ్చు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?