‘అజ్ఞాతవాసి’ ఫోబియా నుండీ ఇంకెప్పుడు బయటకి వస్తాడో..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి తర్వాత దాదాపు ఆ రేంజ్లో రికార్డులు నెలకొల్పేది ఈయనే చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘మగధీర’ రికార్డులను ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో బ్రేక్ చేసాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి1’ రికార్డులను కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాడు. యూ.ఎస్ లో మన సినిమాలకి మంచి డిమాండ్ పెరిగేలా చేసింది కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే..! ‘అతడు’ చిత్రంతో టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచాడు.

అంతా బానే ఉంది కానీ… ‘అత్తారింటికి దారేది’ చిత్రం నుండీ ఒకే రకమైన కథలు తీస్తున్నాడు అనే విమర్శ ఈయన పై ఉంది. అలా అని రిజల్ట్ తేడా కొట్టేవి చాలా తక్కువ. ఒక్క ‘అజ్ఞాతవాసి’ తప్ప అన్ని చిత్రాలు సేఫ్ అయిపోయాయి. కానీ ఇది కంటిన్యూ చేస్తే రిస్క్ అనే చెప్పాలి. ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఆడియో పెట్ట హిట్ అవ్వడం.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న సినిమా..! సంక్రాంతి టైంలో అలాంటి సినిమాలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి.. బాగా క్యాష్ చేసుకుంది. కానీ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ టైములో మళ్ళీ అదే తరహా కథ అంటే చాలా కష్టం. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఫిక్స్ అంటున్నారు. ఇదికూడా ‘కుటుంబంలో సమస్య.. ఓ పెద్ద కంపెనీ.. అందులో సీ.ఈ.ఓ’ అనే థీమ్ తో వస్తే కష్టమే..! అందులోనూ ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. అసలే రాజమౌళి తో సినిమా చేసిన ఏ హీరోకైనా మరుసటి సినిమా చేదు అనుభవాన్నే మిగులుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. కాబట్టి త్రివిక్రమ్ అదే ఫార్మేట్ లో సినిమా చేస్తే మాత్రం మరో ‘అజ్ఞాతవాసి’ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ట్రాక్ మారుస్తాడేమో చూడాలి..!

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus