ఆ విషయంలో త్రివిక్రమ్ ఇబ్బంది పడుతున్నాడా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం ఏకంగా 162 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో విమర్శల పాలైన త్రివిక్రమ్.. ఆ తరువాత వెంటనే ‘అరవింద సమేత’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ప్లాపుల్లో ఉన్న అల్లు అర్జున్ ను కూడా గట్టెక్కించాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం త్రివిక్రమ్ సక్సెస్ కాలేక ఇబ్బంది పడుతున్నాడు. అది కూడా సునీల్ విషయంలోనే..! మళ్ళీ కమెడియన్ గా రాణించాలి అని సునీల్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో తన స్నేహితుడైన త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ చిత్రంలో నటించాడు. కచ్చితంగా త్రివిక్రమ్.. సునీల్ కు బ్రేక్ ఇస్తాడు అనుకుంటే.. అలా జరగలేదు. చెప్పాలంటే ఆ సినిమాలో సునీల్ కు లెంగ్త్ ఉన్న పాత్రే ఇచ్చాడు త్రివిక్రమ్.. కానీ ఆ పాత్ర సరిగ్గా పండలేదు. ఇక తరువాత ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి కూడా సేమ్ రిజల్ట్. దాంతో త్వరలో ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న సినిమాలో సునీల్ పాత్రను బాగా డిజైన్ చేసి అతనికి బ్రేక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడట త్రివిక్రమ్.

గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘నువ్వే నువ్వే’ ‘అతడు’ ‘జల్సా’ వంటి సినిమాల్లో సునీల్ తో అదిరిపోయే కామెడీ చేయించాడు. ఇప్పటికీ అవి అలరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసిన ‘మన్మధుడు’ ‘మల్లీశ్వరి’ ‘జై చిరంజీవ’ వంటి చిత్రాల్లో కూడా సునీల్ కోసం అద్బుతమైన కామెడీ ట్రాక్ ను రాశాడు. మరి ఇప్పుడెందుకు సునీల్ విషయంలో త్రివిక్రమ్ ఇబ్బంది పడుతున్నాడో అర్ధం కాని ప్రశ్న..! ఏమైతేనేం ఈసారైనా సునీల్ క్లిక్ అయితే అంతే చాలు.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus