Mahesh Babu, Trivikram: మహేష్- త్రివిక్రమ్ మూవీలో అతను కూడా..!

మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటినవి ఏమీ కాదు. ‘అతడు’ జస్ట్ హిట్ అనిపించుకుంది.. ఇక ‘ఖలేజా’ డిజాస్టర్ అయ్యింది. కానీ బుల్లితెర పై ఇవి రెండు బ్లాక్ బస్టర్లనే చెప్పాలి. అయినప్పటికీ ఈ కాంబినేషన్ అనేసరికి ఎనలేని క్రేజ్ ఏర్పడుతుంది. అయితే మహేష్- త్రివిక్రమ్ ఈ సారి చేయబోయే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు. అందుకోసం త్రివిక్రమ్ కు కలిసొచ్చిన ఫ్యామిలీ స్టోరీకే మహేష్ ఓకే చెప్పినట్టు వినికిడి.

అయితే ఈ మూవీలో ఓ అగ్ర నటుడుని ఎంపిక చేసుకోవాలని మహేష్ కోరుతున్నట్టు సమాచారం. ఆ అగ్ర నటుడు మరెవరో కాదు ప్రకాష్ రాజ్. మహేష్ బాబుకి అత్యంత సన్నిహితుడు ప్రకాష్ రాజ్. ఇతను లేకుండా మహేష్ నటించిన సినిమాలు తక్కువే. మహేష్ బాబు ఇప్పటివరకు 26 సినిమాల్లో నటిస్తే.. అందులో ప్రకాష్ రాజ్ లేకుండా చేసిన సినిమాలు 10 మాత్రమే. అందులో చాలా వరకు డేట్స్ అడ్జస్ట్ కాలేక ప్రకాష్ రాజ్… మహేష్ సినిమాల్లో నటించలేకపోయాడు. ‘సర్కారు వారి పాట’ లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడా లేదా అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.

కానీ త్రివిక్రమ్ సినిమాలో మాత్రం ప్రకాష్ రాజ్ ఉండాలని మహేష్ నిర్మాతల్ని కోరాడట. కొన్నేళ్లుగా త్రివిక్రమ్.. సినిమాల్లో ప్రకాష్ రాజ్ కనిపించడం లేదు.వీరి కాంబినేషన్లో వచ్చిన లాస్ట్ మూవీ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’. నిజానికి ‘అల వైకుంఠపురములో’ మూవీలో మురళీ శర్మ పాత్రని ప్రకాష్ రాజ్ కోసమే రాసుకున్నాడు త్రివిక్రమ్. కానీ ఎందుకో ప్రకాష్ రాజ్.. ఆ పాత్ర చేయలేదు. దానికి కారణాలు ఏంటి అన్నది మాత్రం బయటకి రాలేదు.మరి మహేష్ కోసం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తాడా.. ఇందుకు త్రివిక్రమ్ ఓకే అంటాడా? అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus