Vijay: పొలిటికల్ ఎంట్రీ ఓకే.. కమిట్ అయిన ప్రాజెక్టుల సంగతేంటి విజయ్?

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కన్ఫర్మ్ చేసేశాడు. ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. మ‌రో రెండేళ్ల‌లో త‌మిళ‌నాట జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ పోటీ చేయడం ఖాయం. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో `గోట్‌` అనే సినిమా చేస్తున్నాడు. అది త్వరలోనే పూర్తవుతుంది.కానీ ఆ సినిమా తర్వాత ఎన్నికలకి చాలా టైం ఉంటుంది. మరి ఈలోగా కమిట్ అయిన ప్రాజెక్టులు విజయ్ ఫినిష్ చేస్తాడా? విజయ్ కి చాలా ప్రొడక్షన్ హౌస్ లు అడ్వాన్సులు ఇచ్చాయి.

అందులో మన ‘మైత్రి’ బ్యానర్ కూడా ఉంది. ‘వరిసు’ కంటే ముందుగానే విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసింది ‘మైత్రి’ సంస్థ. అలాగే దిల్ రాజుకి ఇంకో సినిమా చేసి పెడతానని కూడా ముందే హామీ ఇచ్చాడు విజయ్. తమిళంలో అయితే 4 పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు విజయ్ కి అడ్వాన్సులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో విజయ్ వాళ్ళకి సినిమాలు చేస్తాడా? లేక తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తాడా? అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడం అంటూ జరిగితే..

అది వడ్డీలతోనే వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. విజయ్ (Vijay) అందుకున్న అడ్వాన్సుల లెక్కలు రూ.150 కోట్ల నుండి రూ.200 కోట్ల వరకు ఉన్నట్లు వినికిడి. ‘వరిసు’ కి చేసినట్టు ఇద్దరు నిర్మాతలని లేదా ముగ్గురు నిర్మాతలని భాగస్వాములుగా పెట్టి సినిమా చేసే ఆప్షన్ కూడా విజయ్ ముందు ఉంది. ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags