Vishal: ఈసారైనా విశాల్ హిట్ కొడతాడా..?

కోలీవుడ్ హీరో విశాల్ తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ.. సినిమా షూటింగ్ కొంతభాగం తెలుగు రాష్ట్రాల్లో చేస్తుంటాడు. తన కెరీర్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తుంటాడు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం అతడు ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. రెండేళ్లుగా వరుసపెట్టి ఫ్లాపులిస్తున్న ఈ హీరో ఈ ఏడాది హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. తన హోప్స్ అన్నీ ‘సామాన్యుడు’ సినిమాపైనే పెట్టుకున్నాడు.

తను ఏ సినిమా చేసినా.. అందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడు విశాల్. ‘సామాన్యుడు’ కూడా అదే జానర్ లో తెరకెక్కింది. ఈసారి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ సినిమా చేశాడు విశాల్. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. కానీ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశారు. తన కెరీర్ లో 31వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహించాడు విశాల్.

ఈ సినిమా తమిళంలో పాటు తెలుగులో కూడా హిట్ అవ్వడం విశాల్ కు చాలా అవసరం. ఎందుకంటే.. ఇప్పటికే తెలుగులో విశాల్ మార్కెట్ పడిపోయింది. అతడి సినిమాలకు మంచి ఆఫర్లు రావడం లేదు. మరోవైపు తెలుగులో నాన్-థియేట్రికల్ మార్కెట్ ను కూడా అతడు కోల్పోయాడు. తిరిగి తన మార్కెట్ రేంజ్ పెంచుకోవాలంటే ‘సామాన్యుడు’ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus