Bigg Boss 7 Telugu: శివాజీ సలహాతోనే యావర్ ఆ పని చేశాడా ? నాగార్జున చేసి తప్పేంటంటే.?

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో అత్యంత నాటకీయత చోటు చేసుకుంది. ఎప్పటిలాగానే హౌస్ లో నలుగురు ఫైనలిస్ట్ లు ఉన్నప్పుడు నాగార్జున సెలబ్రిటీతో సూట్ కేస్ లోపలకి పంపించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇద్దరూ వెళ్లి హౌస్ మేట్స్ ని టెమ్ట్ చేశారు. అందరినీ అడుగుతున్నారు. సూట్ కేస్ లో 15లక్షలు ఉందని చెప్పి ఆసక్తిని రగిలించారు. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ ముగ్గురూ కూడా వద్దని చెప్పారు. యావర్ సంశయించాడు. ఇక్కడే నాగార్జున మాట్లాడుతూ., ఉట్టి చేతులతో వెళ్లేకంటే ఎంతో కొంత తీసుకుని వెళ్లడం అనేది కరెక్ట్ ఆలోచించుకో అని టైమ్ ఇచ్చాడు.

ఈ టైమ్ గ్యాప్ లోనే అవసరమైతే మీ అన్నయ్య సలహా కూడా తీస్కోవచ్చు అనేసరికి, యావర్ కి ధైర్యం వచ్చింది. ఎందుకంటే, బయట పోలింగ్ ఎలా ఉందో వాళ్ల బ్రదర్ కి క్లియర్ గా తెలుసు. అంతేకాదు, విన్నర్ పల్లవి ప్రశాంత్ లేదా అమర్ దీప్ , శివాజీల మద్యలోనే ఉంటుందని కూడా తెలుసు. అందుకే, ధైర్యంగా తీస్కో బేటా, మనకి అప్పులు ఉన్నాయి కదా అంటూ ఫ్యామిలీ అప్పులు తీరిపోతాయ్ అంటూ చెప్పాడు. అంతేకాదు, నాగార్జున కూడా రైట్ టైమ్ లో రైట్ డెసీషన్ తీస్కోవాలని, అప్పులు ఉంటే తీస్కుంటే మంచిదన్నట్లుగా ఇండైరెక్ట్ గా సలహా ఇచ్చాడు.

దీంతో యావర్ కాసేపు ఆలోచించి సూట్ కేస్ తీసుకుంటానని చెప్పాడు. నిజానికి విన్నర్ అయితేనే 50 లక్షలు వస్తాయ్, విన్నర్ అవ్వకపోతే ఏమీ రాదు. రెమ్యూనిరేష్ తప్ప, గిఫ్ట్స్ కూడా ఉండవ్. దీంతో యావర్ 15లక్షల సూట్ కేస్ తీస్కుని హౌస్ నుంచీ బయటకి వచ్చాడు. 4వ పొజీషన్ లో సెటిల్ అయ్యాడు. దీన్ని బట్టీ చూస్తే హౌస్ మేట్స్ అందరికీ ఒక స్పష్టమైన అవగాహన అయితే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఒకరకంగా చూస్తే యావర్ సూట్ కేస్ తీస్కోవడం రైటే.

థర్డ్ అండ్ ఫోర్త్ పొజీషన్స్ లో ఉన్నప్పుడు ఇంకా ముందుకు వెళ్తామా లేదా అనేది తెలియనపుడు వచ్చిన ఎమౌంట్ లో కనీసం కొంత అయినా వస్తుందని, అవసరాలు ఉన్నాయని అనిపిస్తే తీస్కోవచ్చు. కానీ, ఫైనల్ గా ఇద్దరే మిగిలారు అనుకోండి ఛాన్స్ తీస్కోకూడదు.అప్పుడు ఏదైనా జరగచ్చు. లాస్ట్ టైమ్ సీజన్ 6లో శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పేసరికి అందరి దిమ్మతిరిగిపోయింది. అందుకే, నలుగురు ఉన్నప్పుడ ఈ డెసీషన్ తీస్కోవడం యావర్ ఒకరకంగా మేలే జరిగింది. నిజానికి హౌస్ లో చాలామటుకు హింట్స్ వెళ్లిపోతాయ్, ఫ్రెండ్స్ స్టేజ్ పైకి వచ్చినపుడు టాప్ 5 కంటెస్టెంట్స్ ని చెప్తారు.

దాన్ని బట్టీ పల్లవి ప్రశాంత్ లేదా శివాజీ ఇద్దరిలోనే విన్నర్ ఉంటాడని ముందుగానే గ్రహించారు. అందుకే,యావర్ డేర్ స్టెప్ తీస్కున్నాడు. అంతకు ముందే శివాజీ ఛాన్స్ ఏదైనా వస్తే అస్సలు మిస్ చేస్కోవద్దని చాలా స్పష్టంగా చెప్పాడు. యావర్ తన ఆర్ధిక ఇబ్బందులు గురించి శివాజీకి చెప్పినపుడు శివాజీ దగ్గరుండీ మరీ ఓదార్చాడు. తనకి వీకెండ్ బట్టలు అడగను అని, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఆర్ధిక ఇబ్బందుల వల్లే (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ కి లోన్ తీస్కుని మరీ వచ్చానని చెప్పాడు. దీంతో శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అందుకే, యావర్ క్యాష్ తీస్కుని వెళ్లిపోవడం అనేది కరెక్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి అందరి రెమ్యూనిరేషన్స్ తో పోలిస్తే యావర్ కి తక్కువే అని చెప్పొచ్చు. అందుకే, యావర్ మనీ తీస్కోవడం అనేది కెరక్ట్ గానే అనిపిస్తోంది. అందులోనూ తను ఆడిన గేమ్ కి విన్నర్ అవ్వాలి. తెలుగు అబ్బాయి అయి ఉంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యి ఉండేవాడు. ఆ ఒక్కటి యావర్ కి విజేత అయ్యే అర్హత లేకుండా చేసింది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus