SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

నిన్నటి నుండి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ‘మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి బాడీ డబుల్స్ ని వాడటం లేదు’ అని..! ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకి బాడీ డబుల్స్, డూప్స్ ఎక్కువగా ఉంటున్నారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలకు వాళ్ళు చాలా ముఖ్యమైపోయారు. రాంచరణ్ సినిమాల్లో అంత ఎక్కువగా డూప్ వాడకం ఉండదు అని చెబుతుంటారు. వాస్తవానికి డూప్ పెద్ద సినిమాలకి చాలా అవసరం. ఎందుకంటే పెద్ద హీరోలు రిస్కీ షాట్లు చేసి పొరపాటున గాయపడితే షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది.

SSMB29

షూటింగ్ డిలే అయితే నిర్మాత కోట్లల్లో నష్టపోతారు. అందుకే డూప్ ని వాడటం అనేది ఆనవాయితీగా వస్తోంది. అలా అని ఈ మధ్యన పెద్ద సినిమాల సెట్స్ లో హీరోలకంటే డూప్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. కొద్దిరోజుల నుండి ఈ కంప్లైంట్స్ ఎక్కువగానే ఉన్నాయి. ‘హీరో సెట్స్ లో ఉంటే.. అక్కడ పనిచేసే వాళ్ళలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది. కానీ హీరోలకి బదులు డూప్..లు ఉంటే వాళ్ళు కూడా రాజభోగాలు అనుభవిస్తుంటే’ మిగిలిన నటీనటులకు చిరాకు వస్తుంది కదా.

సరే ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. మిగిలిన స్టార్ దర్శకులు తీసే పాన్ ఇండియా సినిమాలు వేరు. రాజమౌళి.. తీసే పాన్ ఇండియా సినిమాలు వేరు. ప్రస్తుతం అతను మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పైగా ఇది యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఎక్కువ శాతం యాక్షన్ పార్ట్ ఉంటుంది. పైగా రాజమౌళి దర్శకుడు కాబట్టి.. అతను సంతృప్తి పొందే వరకు సీన్ ను పదే పదే తీస్తూనే ఉంటాడు.

అలాంటిది మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాకు డూప్ లేదా బాడీ డబుల్ ను వాడటం లేదు అంటున్నారు. ప్రాక్టికల్ గా ఇది అసాధ్యం. ఇంకో రకంగా రిస్క్ కూడా. ఎందుకంటే గతంలో మహేష్ బాబు డూప్ లేకుండా ‘టక్కరి దొంగ’ ‘1 నేనొక్కడినే’ వంటి సినిమాల్లో రిస్కీ షాట్లు చేశాడు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలీకుండానే పెద్ద రిస్కులు చేసేస్తూ ఉంటాడు. అలాంటిది రాజమౌళి వంటి దర్శకుడు ఉంటే అతను తగ్గుతాడా? రాజమౌళి కూడా తన షూటింగ్ కి ఇబ్బంది కాకుండా హీరో విషయంలో ఎక్కువ జాగ్రత్తలే తీసుకుంటాడు. అలాంటప్పుడు డూప్ లేదా బాడీ డబుల్ లేకుండా షూటింగ్ ఎలా చేస్తారు.

అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus