Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ పేరుతో లక్షలు కొట్టేసిన మహిళ..!

సినిమా వాళ్ళ పేర్లు చెప్పి స్కాములు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.మొన్నామధ్య సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చెప్పి ఓ యువకుడు ఎంతో మంది వద్ద డబ్బు తీసుకున్నాడు. తర్వాత ఇటీవల శిల్పా చౌదరి అనే మహిళ టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళలను టార్గెట్ చేసి వందల కోట్లు కొట్టేసింది. ఈమె చేతిలో మోసపోయిన వాళ్ళ లిస్ట్ లో మహేష్ సోదరి ఉండడం ఆ టైంకి పెద్ద షాకిచ్చింది.

Click Here To Watch

తాజాగా రమ్య రఘుపతి అనే మహిళ పలువురు కూడా ఇదే స్టైల్ లో స్కామ్ లకి పాల్పడి ఇప్పటికే లక్షల రూపాయలు వసూల్ చేసింది.వివరాల్లోకి వెళితే… ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు,సీనియర్ నటుడు నరేష్ పేరుతో ఆమె ఈ మోసాలకి పాల్పడింది. ఈ క్రమంలో రమ్య రఘుపతి పై ఐదుగురు మహిళలు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో రమ్య రఘుపతి పై ఈ విషయమై కేసు నమోదైంది.

పోలీసులు ఆ ఫిర్యాదు చేసిన మహిళల నుండీ డీటెయిల్స్ సేకరించారు. రమ్య రఘుపతికి … నరేష్ కుటుంబంతో సన్నిహిత్యం ఉంది. నరేష్ కుటుంబ సభ్యులతో ఈమె ఫోటోలు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలను వాడుకునే రమ్య రఘుపతి ఈ మోసాలకు పాల్పడిందని వినికిడి. హైదరాబాద్ లోనే కాదు అనంతపూర్, హిందూపురంలో కూడా కొంతమంది దగ్గర నరేష్, కృష్ణ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి డబ్బులు బాదిందట. ఈ విషయమ్ పై నటుడు నరేష్ కూడా స్పందించారు.

“రమ్య రఘుపతి పాల్పడిన మోసాలతో నాకు సంబంధం లేదు” అంటున్నారు. కానీ రమ్య రఘుపతితో నరేష్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకే క్యాంపస్ లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇరు కుటుంబాల మధ్య చాలా పరిచయాలు ఉన్నాయి. మరి వీటిలో నిజానిజాలు ఏంటన్నది విచారణలో తేలనున్నాయి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus