‘డియర్ కామ్రేడ్’ వంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ హిట్టు కొడతాడు అనుకుంటే .. ఈసారి కూడా చతికిల పడ్డాడు. ఆయన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా పెద్ద ప్లాప్ అయ్యేలా ఉంది. ఒక ‘డియర్ కామ్రేడ్’ లా మాత్రమే కాదు.. ‘నోటా’ ను మించి ప్లాపయ్యేలా కనిపిస్తుంది. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలయ్యింది. మొదటి షో తోనే ప్లాప్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదు. మొదటి రోజు కొద్దిగా పర్వాలేదనిపించినా.. రెండో రోజు నుండీ షాకులివ్వడం మొదలు పెట్టింది ఈ చిత్రం.
ఇక 4 రోజుల కలెక్షన్స్ ను పరిశీలిస్తే :
నైజాం | 3.93 cr |
సీడెడ్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 0.84 cr |
ఈస్ట్ | 0.52 cr |
వెస్ట్ | 0.40 cr |
కృష్ణా | 0.44 cr |
గుంటూరు | 0.67 cr |
నెల్లూరు | 0.28 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.70 cr |
ఓవర్సీస్ | 0.96 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 9.44 cr (share) |
‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి కేవలం 9.44 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది . ఇంకా 10 కోట్ల షేర్ మార్క్ ను కూడా దాటలేదు ఈ చిత్రం. ఇక మొదటి సోమవారం రోజున ఈ చిత్రం కేవలం 0.58 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 21.06 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి మొదటివారం పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Click Here For World Famous Lover Movie Review
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!