మళ్ళీ విజయ్.. సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టేలా ఉన్నాడుగా..!

విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈరోజు(ఫిబ్రవరి 14న) విడుదలయ్యింది. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లా, కేథరిన్ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించారు. మొదటి షో తోనే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఐశ్వర్య రాజేష్ ఎపిసోడ్ బాగానే ఉన్నప్పటికీ.. శీనయ్య పాత్రలో విజయ్ అదరకొట్టినప్పటికీ.. సెకండ్ హాఫ్ మొత్తం అదే ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపించి ఇరిటేట్ చేసాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే విజయ్ దేవరకొండ క్రేజ్ వల్ల.. మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ రావడం ఖాయంలా కనిపిస్తుంది. మొదటి రోజు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల నుండీ 6 కోట్ల వరకూ షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. లెక్క మించిన ఆశ్చర్య పడనక్కర్లేదని కూడా వారు చెబుతున్నారు. ఇక శని, ఆదివారాలకు కూడా బుకింగ్స్ బాగున్నాయి కాబట్టి.. టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత బలమైందో చూడాలి. ఇక ఈ చిత్రానికి 30.5 కోట్ల వరకూ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. కాబట్టి 31 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus