అన్ని రకాల ఎమోషన్స్ తో కలిసి సినిమాను తెరకెక్కించాలంటే ఒక్క దర్శకుడి వల్లే సాధ్యం కాదు. ఆయనకు తోడుగా రైటర్లు కూడా ఉంటే స్క్రిప్ట్ అందంగా తయారవుతుంది. సీనియర్ హీరో నాగార్జున సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా అదే జరుగుతోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇటీవల నాగార్జునకు ఓ స్క్రిప్ట్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ కథ నచ్చడంతో నాగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ స్క్రిప్ట్ ను పూర్తి యాక్షన్ డ్రామాతో రూపొందించారు.
గతంలో ప్రవీణ్ సత్తారు ఇదే జోనర్ లో సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. కానీ ‘వైల్డ్ డాగ్’ సినిమా రిజల్ట్ తరువాత నాగ్ ఈ వయసులో యాక్షన్ డోస్ ఎక్కువ ఉంటే జనాలు చూడరేమో అని ఫ్యామిలీ, యాక్షన్, ఫన్ అన్నీ మిక్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రాజెక్ట్ లోకి రచయిత అబ్బూరి రవి వచ్చి చేరారు. స్క్రిప్ట్ కు అబ్బూరి రవి చేసిన మార్పులు, చేర్పులు నాగార్జునకు నచ్చినట్లు సమాచారం.
ఆగిపోతుందనుకున్న ఈ సినిమా ముందుకు కదలడానికి మార్గం దొరికిందని అంటున్నారు. గతంలో అబ్బూరి రవి.. యాక్షన్, ఫ్యామిలీ, ఫన్ టచ్ ఉన్న సినిమాలకు పని చేశారు. అందుకే ఈ స్క్రిప్ట్ లో ఆయన్ను ఇన్వాల్వ్ చేసినట్లు తెలుస్తోంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!