‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారు అంటే… మొత్తంగా ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు అని చెప్పొచ్చు. ఆ మాటకొస్తే సినిమా పరిశ్రమే అలా ఉంది. కారణం శంకర్ లాంటి దర్శకుడితో రామ్‌చరణ్ చేస్తున్న చిత్రమది. హిట్ పర్సంటే.. బ్లాక్ బస్టర్ పర్సంటేజీ ఎక్కువగా ఉన్న ఆ దర్శకుడితో సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఆయన డైలాగ్ తరహలోనే ఓ కామెంట్ వైరల్ అవుతోంది. అదే ‘సినిమాలో ఏది కావాలంటే అది ఇరుక్కు’.
‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని చాలా నెలలుగా దర్శకుడు శంకర్ చెక్కుతూనే ఉన్నారు. కియారా అడ్వాణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మాస్ పాత్రలో కనిపిస్తాడా లేదా క్లాస్ రోల్‌లో కనిపిస్తాడా అని అడిగితే ఆ ఆన్సర్ ఇచ్చారాయన.
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో రామ్ చరణ్ పాత్రకి మల్టిపుల్ వేరియేషన్స్ ఉంటాయని చెప్పిన బుర్రా సాయి మాధవ్… ఈ సినిమాలో మాస్, క్లాస్, రగ్గడ్, డిగ్నిఫైడ్ రోల్స్‌లో రామ్‌చరణ్ కనిపిస్తాడని తెలిపారు. సినిమా ముందుకెళ్లే కొద్దీ చరణ్‌లో ఆ షేడ్స్ అన్నీ కనిపిస్తాయని చెపపారు. ఒక సామాన్యుడు తన జీవితంలో వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ప్రవర్తిస్తాడు. అలా ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కథానాయకుడి పాత్ర ఉంటుంది అని తెలిపారు.
ఇక ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, అంజలి, సునీల్, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ – బుచ్చిబాబు సినిమా మొదలవుతుంది. శంకర్ అయితే ఇంకా ఏ కొత్త సినిమా ప్రకటించలేదు. ఆయన పూర్తి చేసిన కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ విడుదలకు ముస్తాబవుతోంది.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!