Gopimohan: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రచయిత గోపి మోహన్ భార్య.. వైరల్ అవుతున్న ఫోటో!

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దుసుపోతున్న స్క్రీన్ ప్లే రైటర్స్ లో గా గోపి మోహన్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రంతో ఈయన పేరు మార్మోగింది. ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ లో ఈయనకు కూడా భాగం ఉందని ఆ సినిమా టైంలో స్వయంగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.రాంచరణ్ నటించిన బ్రూస్ లీ, ఎన్టీఆర్ నటించిన బాద్ షా, మాస్ మహారాజ రవితేజ నటించిన దుబాయ్ శీను, యాక్షన్ హీరో గోపీచంద్ లక్ష్యం,లౌక్యం..

మంచు విష్ణు నటించిన ఢీ, దేనికైనా రెడీ… అక్కినేని నాగార్జున నటించిన కింగ్, సంతోషం..విక్టరీ వెంకటేష్ నటించిన నమో వెంకటేశ, రామ్ నటించిన రెడీ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఈయన రైటర్ గా పనిచేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా యమజాతకుడు, వంశీ, నువ్వు నేను వంటి సినిమాలకు పనిచేశారు.త్వరలో దర్శకుడిగా కూడా మారి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు ఈయన. ఇదిలా ఉండగా..

రైటర్ గోపిమోహన్ ఈరోజు అభిమానులతో గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు. విషయం ఏంటి అంటే ఆయన ఈరోజు తండ్రయ్యాడు. ఆయన సతీమణి ప్రవీణ నేడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుని ఎత్తుకుని గోపి మోహన్ ఆనందంతో మురిసిపోతున్న ఫోటోని షేర్ చేశాడు.ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు అలాగే నెటిజన్లు.. ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus