Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

ప్రీ రిలీజ్ లో భాగంగా జరిగే హిందీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ చాలా కీలకంగా మారింది. ఈ మధ్య ఓటీటీల రూపంలో కంటే వాటి రూపంలోనే ఎక్కువ మొత్తం వస్తుంది నిర్మాతకి. అయితే ఆ హిందీ డబ్బింగ్ రైట్స్ ఏ రకంగా అమ్ముడుపోతాయి అనేది సీనియర్ రైటర్ కోన వెంకట్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కోన వెంకట్ (Kona Venkat) మాట్లాడుతూ ” ‘నిన్ను కోరి’ (Ninnu Kori) సినిమా చేస్తున్నప్పుడు ఒక్క ఫైట్ కూడా లేకపోతే.. హిందీ డబ్బింగ్ రైట్స్ సేల్ అవ్వడం కష్టం అన్నారు.

Kona Venkat

అప్పుడు నేను నిర్మాత దానయ్య (D. V. V. Danayya) గారు కలిసి దీనిపై చర్చించుకుంటున్నాం. ఈ విషయం నానితో (Nani) చెప్పాం. నాని ‘ఫైట్స్ అవి ఎందుకు సార్.. ఈ కథకి అవి అవసరం లేదు కదా’ అని అన్నాడు. అతను జోనర్ కి జెన్యూన్ గా స్టిక్ అయ్యి ఉంటాడు. అయితే ‘మేము ఒక ఫైట్ పెడదాం అనుకుంటున్నాం నీకేమి ఇబ్బంది లేదు కదా?’ అని నానితో అన్నాను. అందుకు నాని ‘నాకేమీ ఇబ్బంది లేదు.

మీరు పెడతాను అంటే చేద్దాం’ అని అన్నాడు. దీంతో అప్పటికప్పుడు నేను శివ నిర్వాణ (Shiva Nirvana) చర్చించుకుని బోట్స్ వద్ద ఒక చిన్న ఫైట్ పెట్టాం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం పెట్టిన ఫైట్ అది. వాళ్ళకి ‘ముద్దపప్పు’ అవసరం లేదు. ‘ముద్దపప్పు ఆవకాయ’ కావాలి. అప్పుడే వాళ్ళు తీసుకుంటారు.

మనది ‘ముద్ద పప్పు నెయ్యి’ అన్నామంటే ‘మాకు వద్దు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అంటారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) సినిమాలకి నార్త్ లో అంత డిమాండ్ ఉండటానికి కారణం అదే. 2 ఏళ్ల క్రితం అతని సినిమాలకి హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలోనే రూ.12 కోట్లు వచ్చేవి” అంటూ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus