2023 జనవరిలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు సూపర్ హిట్ కొట్టి.. కొత్త ఏడాది బాక్సాఫీస్ బోణీ చేశాయి.. ఇక విజయ్ ‘వారసుడు’ డబ్బింగ్ బొమ్మ కూడా హిట్ అవడం, యావరేజ్ టాక్ తెచ్చుకున్న అజిత్ ‘తెగింపు’ కూడా ఊహించని కలెక్షన్స్ రాబట్టడంతో మేకర్స్, ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాల వారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇక నెలాఖరులో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది.
రెండో వారంలోనూ రికార్డ్ రేంజ్ వసూళ్లతో రచ్చ రంబోలా చేస్తోంది. ఫిబ్రవరి 3న చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయింది ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ.. మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ‘కలర్ ఫోటో’ తో సోలో హీరోగా మారిన సుహాస్ నటనకు మంచి మార్కులు వేశారు ప్రేక్షకులు.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం చూసి స్పందించారు.. ‘‘సినిమా చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాను..
‘రైటర్ పద్మభూషణ్’ క్లైమాక్స్ చాలా అద్భుతంగా అనిపించింది.. తప్పకుండా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది.. సుహాస్ పర్ఫార్మెన్స్ నటన బాగుంది.. ఇంత భారీ విజయం సాధించి డైరెక్టర్ ప్రశాంత్ షణ్ముఖ్, నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. మూవీ టీంకి అందరికీ కంగ్రాచ్యులేషన్స్’’ అంటూ మహేష్ మూవీ యూనిట్‌ని అభినందించారు..దీంతో సుహాస్ సినిమాకి మరింత సపోర్ట్ లభించింది. ఇప్పుడు మేకర్స్ మరో ముందడుగు వేసి..
తమ చిత్రాన్ని మహిళా ప్రేక్షకుల కోసం ఉచితంగా ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 40 స్క్రీన్లలో ‘రైటర్ పద్మభూషణ్’ ఫ్రీ షోలు ప్లాన్ చేశారు. రోజుకి నాలుగు ఆటల చొప్పున కూడా షోలు వెయ్యనున్నారు. ‘‘ఇదో రకం పబ్లిసిటీ స్ట్రాటజీ.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిలింని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి, మౌత్ టాక్‌తో మరింత మందికి రీచ్ అవడానికి మూవీ టీం చేసిన ఈ ఆలోచన అభినందనీయం’’ అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు..