‘తొలివలపు’ చిత్రంతో హీరోగా పరిచయమైన గోపిచంద్… ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో హీరోగా మంచి గుర్తింపుని సంపాదించుకోలేకపోయాడు. గోపీచంద్ సొంత బ్యానర్ పై ఆ చిత్రాన్ని నిర్మించడంతో .. వాళ్ళ ఫ్యామిలీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందనే చెప్పాలి. అందుకే ‘జయం’ చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘నిజం’ ‘వర్షం’ వంటి చిత్రాల్లో కూడా విలన్ గా చేసి మెప్పించాడు గోపి. తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా మళ్ళీ ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఇది కూడా గోపీచంద్ సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమానే..! ఎటువంటి అంచనాలు లేకుండా 2004 వ సంవత్సరం జూలై 2 విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.గోపీచంద్ ను హీరోగా నిలబెట్టింది. ఏ.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మూన్ బెనర్జీ హీరోయిన్ గా నటించింది.
మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.72 cr |
సీడెడ్ | 0.81 cr |
ఉత్తరాంధ్ర | 1.19 cr |
ఈస్ట్ | 0.70 cr |
వెస్ట్ | 0.50 cr |
గుంటూరు | 0.60 cr |
కృష్ణా | 0.45 cr |
నెల్లూరు | 0.35 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.32 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.61 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 8.93 cr |
‘యజ్ఞం’ చిత్రాన్ని నిర్మాతలైన ‘ఈతరం ఫిలిమ్స్’ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు.హీరోకి మార్కెట్ లేకపోవడంతో బయ్యర్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మరియు పబ్లిసిటీ ఖర్చులు వంటివి రికవర్ కావాలి అంటే రూ.5.77కోట్ల వరకు షేర్ రావాలి..! అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.8.93 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!