Yash: అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం?

కన్నడ నాట స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎస్ కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈయనకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు పెరిగిపోయారు. ఈ విధంగా హీరోగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి యష్ జనవరి 8వ తేదీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే అయితే ఈయన పుట్టినరోజు విషాదం నెలకొంది.

సాధారణంగా హీరోల పుట్టినరోజు అంటే అభిమానులు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేస్తూ వారి పుట్టినరోజు వేడుకలను చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఓకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. తమ హీరో పుట్టినరోజు కావడంతో బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో విద్యుత్ తీగల కడ్డీలు తగలడంతో మృత్యువాత పడ్డారు.

ఈ విషయం తెలిసిన యశ్ (Yash) స్వయంగా ఆ గ్రామానికి వెళ్లి బాధితుల కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటానని తెలిపారు. అదే విధంగా తమ పుట్టినరోజు వేడుకలను ఇలా జరుపుతూ కుటుంబానికి అండగా ఉండాల్సిన వారు మరణించడం చాలా బాధాకరంగా ఉందని ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అంటే పుట్టినరోజు అంటేనే అసహ్యం వేస్తుందని పుట్టినరోజు జరుపుకోవాలంటే కూడా భయంగా ఉందని తెలిపారు.

తన అభిమాన కుటుంబాలను ఓదార్చినటువంటి యష్ ఆ కుటుంబాలకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి ఈయన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు కొంతవరకు ఊరట కలిగిందనీ చెప్పాలి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags