తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న రూమర్స్ పై స్పందించిన యష్

ఒకవారం క్రిందట కన్నడ పోలీసులకు ఒక రౌడీ గ్యాంగ్ దొరికింది. ఆ గ్యాంగ్ ను విచారించగా ఒక కన్నడ స్టార్ హీరోను మర్డర్ చేసేందుకు తాము వచ్చామని వాళ్ళు సమాధానం చెప్పడంతో.. ఆ స్టార్ మరెవరో కాదని యష్ అని ఫిక్స్ అయిపోయిన కొన్ని న్యూస్ పేపర్స్ ఆ వార్తను ఫస్ట్ పేజ్ లో ప్రచురించాయి. దాంతో యష్ అభిమానులందరూ అతడ్ని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కంగారుపడడం మొదలెట్టారు. ఈ కారణంగా కర్ణాటకలో అనవసరమైన టెన్షన్స్ నెలకొన్నాయి.

అయితే.. ఈ విషయమై నిన్న యష్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. కె.జి.ఎఫ్ తర్వాత తన స్టార్ డమ్ మరియు క్రేజ్ పెరిగిన విషయం నిజమే కానీ నాకు ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణహానీ జరగలేదు, జరగదు కూడా. న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఈ తరహా వార్తలు రాసే ముందు నన్ను ఒకసారి సంప్రదించడం మంచిది. దయచేసి ఎవరూ ఆ వార్తలను నమ్మకండి అని క్లారిఫై చేశాడు. అయితే.. యష్ క్లారిటీ తర్వాత అసలు ఆ గుండాలు ఏ కన్నడ హీరోను టార్గెట్ చేయడానికి వచ్చారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus