Hero Yash: కన్నడ వాళ్ళ పై మనవాళ్ళు ఇలా రివేంజ్ తీర్చుకున్నారా?

  • April 11, 2022 / 03:29 PM IST

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ పాన్ ఇండియా మూవీగా రూపొందిన సంగతి తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ ప్రమోషన్లలో భాగంగా దేశమంతా తెగ రౌండ్లు వేసాడు.ఇదే క్రమంలో బెంగుళూర్ లో కూడా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.అయితే 11 గంటల 30 నిమిషాలకి ప్రెస్ మీట్ అయితే బన్నీ 1:30 గంటలకి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఓ కన్నడ రిపోర్టర్ అల్లు అర్జున్ పై మండిపడ్డ సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

’11:30 కి ప్రెస్ మీట్ అయితే మీరు 1:30 కి హాజరయ్యారు. 2 గంటలు లేట్ గా వచ్చారు. 2 గంటల నుండీ జర్నలిస్ట్ లని కెమెరా మెన్ లని వెయిట్ చేయించడం మీకు ఏమైనా బాగుందా? మమ్మల్ని ఇంత సేపు వెయిట్ చేయించడం పట్ల మీ ప్రధాన ఉద్దేశం ఏంటి?’ అంటూ అల్లు అర్జున్ ను ప్రశ్నించాడు ఓ జర్నలిస్ట్.దాంతో బన్నీ వాళ్ళందరికీ క్షమాపణలు కూడా తెలిపాడు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు కన్నడ హీరో అయిన యష్ కు అలాంటి అనుభవమే ఎదురైంది.

‘కె.జి.ఎఫ్2’ తెలుగు ప్రమోషన్లలో భాగంగా వైజాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి యష్ హాజరయ్యాడు. ఇతను కూడా గంటన్నర లేటుగా హాజరయ్యాడట. దీంతో యష్ ను ఈ విషయమై ప్రశ్నించింది మన టాలీవుడ్ మీడియా. దానికి యష్ వెంటనే అందరికీ క్షమాపణలు తెలిపాడట. సో కన్నడ జనాల పై రివేంజ్ మన వాళ్ళకి ఇలా తీరిందన్న మాట. సాధారణంగా హీరోలు ఇలాంటి మీటింగ్ లకి హాజరయ్యేప్పుడు ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్ వంటివి ఏర్పడుతూ ఉంటాయి.

కానీ కన్నడ మీడియా ‘పుష్ప’ టైములో ఈ విషయాన్ని పెద్ద ఇష్యుగా స్ప్రెడ్ చేసాయి. ఇక ‘కె.జి.ఎఫ్2’ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న విడుదల కాబోతుండగా.. ఇప్పుడు టీమ్ ప్రమోషన్లని వేగవంతం చేసారు. ‘కె.జి.ఎఫ్’ మొదటి భాగం ఇక్కడ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus