Yash: అలా చేస్తే మాత్రం యశ్ కెరీర్ కు నష్టమేనా?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలతో ఒకే సమయంలో యశ్, ప్రశాంత్ నీల్ లకు ప్రేక్షకుల్లో క్రేజ్ దక్కిందనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. ఈ సినిమాల సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలతో బిజీ అయితే యశ్ మాత్రం కొత్త ప్రాజెక్ట్ లకు డైరెక్టర్లను ఎంపిక చేసుకునే విషయంలో బిజీ అయ్యారు. కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాకు ముందు యశ్ ఎక్కువగా కన్నడ సినిమాలలోనే నటించారు.

అయితే తర్వాత ప్రాజెక్ట్ లను కూడా కన్నడలోనే తెరకెక్కించి ఆ సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలని యశ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కన్నడలో యశ్ తో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించి సక్సెస్ సాధించే సత్తా ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువమంది ఉన్నారు. మరోవైపు యశ్ బాలీవుడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. కెరీర్ విషయంలో యశ్ తప్పటడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యశ్ కన్నడ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే నటించాలని ఫిక్స్ అయితే మాత్రం ఆయన కెరీర్ కు ఈ నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంది. యశ్ ప్రాక్టికల్ గా ఆలోచించి కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో యశ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని బోగట్టా.

యశ్ తర్వాత ప్రాజెక్ట్ లు ఆయన రేంజ్ ను పెంచుతాయో లేదో చూడాల్సి ఉంది. భాషతో సంబంధం లేకుండా యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ లోకల్ ఫీలింగ్ ను వదిలేసి ప్రభాస్, ఎన్టీఆర్ లతో వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటుండగా యశ్ మాత్రం కెరీర్ విషయంలో తడబడుతున్నారు. త్వరలో యశ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus