సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ కాబోతుంది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ మూవీలో సమంత గర్భిణిగా కనిపించబోతుండడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. దీంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. వాటి వివరాలను ఒకసారి గమనిస్తే :
నైజాం | 4.30 cr |
సీడెడ్ | 1.45 cr |
ఆంధ్ర | 5.20 cr |
ఏపీ+తెలంగాణ | 10.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.40 cr |
తమిళ్ | 4.00 cr |
హిందీ | 1.80 cr |
ఓవర్సీస్ | 2.50 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 20.65 cr |
యశోద చిత్రానికి రూ.20.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టల్సి ఉంది. నవంబర్ వంటి అన్ సీజన్ లో అదీ లేడీ ఓరియెంటెడ్ మూవీతో అంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ఓపెనింగ్స్ భారీగా సాధిస్తేనే ఆ ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి యశోద ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!