Samantha: డాక్టర్ సమక్షంలో యశోద డబ్బింగ్…అసలు విషయం చెప్పిన నిర్మాత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలంగా ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే సమంత తన అనారోగ్య సమస్య గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఒక్కసారిగా సినీ సెలెబ్రెటీలు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రస్తుతం సమంత తన సినిమాలన్నింటికీ కాస్త విరామం ప్రకటించి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఈమె పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ చిత్రంగా నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే సమంత అనారోగ్యం కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాత శివలెంఖ కృష్ణ ప్రసాద్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సమంత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

యశోద సినిమా కథ విన్న తర్వాత ఈసినిమాకు సరైన కథానాయక సమంత అని మాత్రమే అనిపించింది అందుకే ఆమెకు కథ వివరించగానే సినిమాకి ఓకే చెప్పిందని నిర్మాత వెల్లడించారు. ఇక సమంత అనారోగ్యం గురించి ప్రస్తావిస్తూ సినిమాకు ఏమైనా సమంత లేని లోటు కనబడుతుందా అంటూ ప్రశ్నించగా..సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలోనే మాకు సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని తెలిసింది.

ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియచేయడానికి నాలుగు రోజులు ముందు ఆ విషయం మాకు తెలిసిందని నిర్మాత తెలిపారు.తనకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ తెలుగులో తానే డబ్బింగ్ చెప్పిందని తమిళంలో వేరే వారి చేత డబ్బింగ్ చెప్పిస్తామన్నప్పటికీ తమిళ వారికి నా వాయిస్ తెలుసు కనుక నేనే డబ్బింగ్ చెబుతానని డాక్టర్ ను పక్కన పెట్టుకొని నాలుగు రోజులపాటు ఈ సినిమా డబ్బింగ్ చెప్పిందనీ, సినిమాలంటే సమంతకు అంత డెడికేషన్ అంటూ నిర్మాత శివలెంఖ కృష్ణ ప్రసాద్ సమంత గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus