దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర అంశాన్ని తీసుకుని ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8 న అంటే సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందించింది. 5 ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయితే టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పాలి. కానీ రెండో రోజు డౌన్ అయిపొయింది. మూడో రోజు కూడా పెద్దగా గ్రోత్ చూపింది అంటూ ఏమీ లేదు. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.37 cr |
సీడెడ్ | 0.47 cr |
ఆంధ్ర(టోటల్) | 0.31 cr |
ఏపీ + తెలంగాణ | 1.15 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.26 cr |
ఓవర్సీస్ | 0.30 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 1.71 cr |
‘యాత్ర 2’ (Yatra2) చిత్రం రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.71 కోట్ల షేర్ ను రాబట్టింది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.71 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.6.29 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరి ఆదివారం ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!