Bigg Boss 7 Telugu: గ్రాండ్ ఫినాలేలో యావర్ ట్విస్ట్..! అసలు ఏం జరిగిందంటే.!

బిగ్ బాస్ హౌస్ లో గ్రాండ్ ఫినాలే షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతోంది. శనివారం అంగరంగ వైభవంగా షూటింగ్ పూర్తి అయ్యింది. ఆదివారం గ్రాండ్ ఫినాలే సాయంత్రం 6 గంటల నుంచీ స్టార్ట్ అవుతుంది. హోస్ట్ నాగార్జునతో పాటుగా రవితేజ కూడా సందడి చేయబోతున్నాడు. ఫస్ట్ బబుల్ గమ్ టీమ్ నుంచీ హీరో రోషన్ కనకాల, హీరోయిన్ వచ్చి సందడి చేశాడు. వీళ్ల తర్వాత పాత కంటెస్టెంట్స్ అందరూ డ్యాన్స్ పెర్ఫామన్స్ తో ఇరగదీశారు.

శోభాశెట్టి, అశ్విని డ్యాన్స్ పెర్ఫామన్స్ తో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత టాప్ 6 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని వివిధ పద్దతుల్లో ఎలిమినేట్ చేశాడు కింగ్ నాగార్జున. అర్జున్ మొదటగా ఇంటి నుంచీ ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి యాంకర్ శ్రీముఖి వచ్చినపుడు సిల్వర్ సూట్ కేస్ లో 20 లక్షల ఆఫర్ ఇచ్చింది. కానీ, ఎవ్వరూ కూడా తీసుకోలేదు. గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైకి వెళ్లాలని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు.

అప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు అందులోనుంచీ ప్రియాంక ఎలిమినేట్ అయిపోయింది. ప్రియాంకని చాలా గ్రాండ్ గా ఎలిమినేట్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అలాగే, యావర్ సూట్ కేస్ ఇంటిలోకి పంపినప్పుడు కొద్దిగా టెమ్ట్ అయ్యాడు. ఫస్ట్ 10 లక్షల బ్రీఫ్ కేస్ 5లక్షలు పెంచి 15 లక్షలు చేయగానే యావర్ కొంచెం ఆసక్తిని చూపించాడు. అందరిని సంప్రదించుకుని సూట్ కేస్ తీస్కుని బయటకి వచ్చేశాడు. దీంతో టాప్ – 3 ఇంటి సభ్యులు మాత్రమే మిగిలారు.

శివాజీ సలహా మేరకే యావర్ సూట్ కేస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ టీమ్ కానీ, ఆడియన్స్ కానీ ఇది ఊహించలేదు. కానీ, యావర్ అందరి అంచనాలని తల్లక్రిందులు చేస్తు ట్విస్ట్ ఇచ్చాడు. శివాజీ, అమర్ ఇంకా పల్లవి ప్రశాంత్ ముగ్గురు మాత్రమే చివరి వరకూ మిగిలారు. వీళ్ల ముగ్గురిలో శివాజీ కూడా ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచీ బయటకి వచ్చేశాడు. అంతేకాదు, చివరికి టాప్ 2లో ఇద్దరే మిగిలారు. అమర్ దీప్ ఇంకా పల్లవి ప్రశాంత్ వీరిద్దరిలో ఎవరికి కప్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus