‘ఏడు చేపల కథ’ క్లోజింగ్ కలెక్షన్స్ ?

‘చరిత సినిమా ఆర్ట్స్’ బ్యానర్ పై జి.వి.ఎన్ శేఖర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ఏడు చేపల కథ’. ఎస్.జె.చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అభిషేక్, ‘బిగ్ బాస్’ భానుశ్రీ ప్రదాన పాత్రలు పోషించారు. పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదలయ్యింది. టీజర్, ట్రైలర్ లు చూసి ఓ రేంజ్లో టెంప్ట్ అయ్యి ఈ చిత్రానికి పరుగులు తీశారు ఓ వర్గం ప్రేక్షకులు. అయితే అంత టెంప్ట్ అయ్యి వెళ్ళినవారికి మాత్రం చుక్కలు కనిపించాయని కామెంట్స్ చేశారు.

ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.93 cr
సీడెడ్ 0.47 cr
ఉత్తరాంధ్ర 0.26 cr
ఈస్ట్ 0.16 cr
వెస్ట్ 0.13 cr
కృష్ణా 0.16 cr
గుంటూరు 0.14 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ 2.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.08 cr
ఓవర్సీస్ 0.03 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.46 cr (share)

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి 1.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఫుల్ రన్ పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా 2.46 కోట్ల షేర్ ను రాబట్టింది. చిత్రం కొన్న బయ్యర్స్ అంతా లాభాల బాట పట్టారు. అయితే చీప్ ట్రిక్స్ తో హిట్ కొట్టారనే విమర్శలు మాత్రం ఇంకా ఆగట్లేదు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus