Sakunthalam: సమంత ఈసారి పక్కా పాన్ ఇండియా సూపర్ స్టార్ అవుతుందంటున్న ఫ్యాన్స్..

  • February 2, 2023 / 07:29 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’.. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన గుణ శేఖర్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె చిన్నారి అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా పరిచయమవుతోంది.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఫిబ్రవరి 17న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. సమంత కెరీర్‌లో సోలోగా మరో సూపర్ హిట్ అందుకోనుందనిపించేలా ‘శాకుంతలం’ ట్రైలర్ ఉందంటున్నారు సామ్ ఫ్యాన్స్.. అయితే అనుకున్న సమయానికంటే సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే ప్రమోషన్స్ స్పీడప్ చేసింది టీం. రీసెంట్‌గా ఓ ఫీల్ గుడ్ సాంగ్ రిలీజ్ చేశారు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ ట్యూన్ కంపోజ్ చేయగా.. చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి చాలా బాగా పాడారు. చాలా రోజుల తర్వాత మనసుని తాకే మంచి మెలోడీ సాంగ్ విన్నామంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. స్టార్ హీరో లేకపోయినా సోలోగా సత్తా చాటుతున్న సమంత ఇటీవల ‘యశోద’ తో బాక్సాఫీస్ బరిలో సత్తా చాటింది.

‘శాకుంతలం’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈసారి సాలిడ్ సూపర్ హిట్ కొట్టి.. స్టార్ హీరలకు సమాంతరంగా తన మార్కెట్ పెంచుకుంటుంది సమంత.. ఎందుకంటే ‘శాకుంతలం’ ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉండడమే కాక తన లుక్స్, ఓన్ డబ్బింగ్ అండ్ పర్ఫార్మెన్స్‌కి చాలా మంచి పేరు వస్తుంది అంటూ ఫ్యాన్స్

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus