అవును రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ

బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని బాలీవుడ్ ఛానెల్స్ కూడా ఫర్హాన్ పెళ్లికి సంబంధించిన కథనాలను ప్రచురించాయి. 2016లో తన భార్య అధునా బబానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్ అప్పటినుంచి సింగర్ శిబానీ దండేకర్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 21న వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Click Here To Watch

అయితే దీనిపై ఇంతవరకు ఫర్హాన్ కానీ శిబానీ కానీ స్పందించలేదు. పెళ్లి గురించి వీరిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అసలు ఈ వార్తలో నిజముందా..? లేదా..? అనే సందేహాలు కలిగాయి. ఈ క్రమంలో ఫర్హాన్‌ రెండో పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత జావేద్‌ అక్తర్‌ క్వారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ నేషనల్ ఛానెల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఫర్హాన్ రెండో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

వీటిపై స్పందించిన ఆయన.. ఫర్హాన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. ‘ అందరూ అనుకుంటున్నట్లుగానే ఫిబ్రవరి 21వ తేదీన పెళ్లి ముహుర్తానికి డేట్‌ ఫిక్స్ అయింది. ఈ పెళ్లికి ఎవరినీ ఆహ్వానించడం లేదు. కొద్దిమంది సన్నిహితులు, బంధువులను మాత్రమే హాజరవుతారు. కరోనా పరిస్థితులు నేపథ్యంలో వారి పెళ్లిని నిరాండబరంగా ప్లాన్‌ చేసుకున్నారు’ అని చెప్పుకొచ్చారు. తనకు కాబోయే కోడలు శిబానీ గురించి గొప్పగా మాట్లాడారు జావేద్. శిబానీ మంచి అమ్మాయి అని..

కుటుంభసభ్యులందరికీ బాగా నచ్చిందని చెప్పారు. శిబానీతో ఫర్హాన్ కు చాలా కాలంగా పరిచయం ఉందని.. వారిద్దరి రిలేషన్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. 2018 నుంచి ఫర్హాన్, శిబానీ డేటింగ్ చేస్తున్నారని సమాచారం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus