సాధారణంగా సినీతారలపై లవ్ ఎఫైర్ – ఫలానా వారితో పెళ్లి ….అంటూ రకరకాల రూమర్లు వస్తుంటాయి. ఆ గాసిప్స్ ను కొంతమంది లైట్ తీసుకొని వదిలేస్తే…మరికొంతమంది ఘాటుగా జవాబిస్తారు. మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం తన పెళ్లి పై వచ్చిన రూమర్స్ పై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. తనకు ఆల్రెడీ ఓ అమ్మాయితో పెళ్లయిందని – తమకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారని అదిరిపోయే జవాబిచ్చాడు. తాజాగా తన పెళ్లి గురించి ఎదురైన ఓ ప్రశ్నకు హీరోయిన్ కాజల్ ఆసక్తికర సమాధానమిచ్చింది.
నేనే రాజు నేనే మంత్రితో మంచి హిట్ అందుకున్న కాజల్ ప్రస్తుతం…..తమిళంలో “పారిస్ పారిస్”తో పాటు తెలుగులో కళ్యాణ్ రామ్ తో “ఎమ్మెల్యే” సినిమాలో నటిస్తోంది.
తాజాగా ఆమె అనంతపురంలో నూతనంగా ఏర్పాటైన ఓ డ్రెస్ సర్కిల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా కాజల్ మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి సినిమాల గురించి చెప్పింది. ఆ సమయంలో కాజల్ పెళ్లి విషయం ప్రస్తావించగా ఆమె చాలా సరదాగా జవాబిచ్చింది. పెళ్లి విషయం గురించి తన నాన్ననే అడగాలంటూ కాజల్ చమత్కారంగా జవాబిచ్చి అందరినీ నవ్వించింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏదీ లేనట్లు సమాధానమిచ్చి కాజల్ నైస్ గా ఎస్కేప్ అయింది.