నిఖిల్ (Nikhil Siddhartha) – సుధీర్ వర్మ (Sudheer Varma) కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) .గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘స్వామి రారా’ (Swamy Ra Ra) మంచి విజయాన్ని అందుకోగా, ‘కేశవ’ (Keshava) పర్వాలేదు అనిపించింది. అయితే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా వస్తున్నట్టు ఎక్కువమంది ప్రేక్షకులకు తెలీదు. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 8న.. విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్ పాటలు ఓకే అనిపించాయి.
అయినప్పటికీ చెప్పుకోదగిన రేంజ్లో ఈ సినిమాకి బిజినెస్ అయితే జరగలేదు. ఒకసారి (Appudo Ippudo Eppudo) వాటి వివరాలు గమనిస్తే :
| నైజాం | 2.50 cr | 
| సీడెడ్ | 0.60 cr | 
| ఉత్తరాంధ్ర | 0.80 cr | 
| ఈస్ట్ | 0.40 cr | 
| వెస్ట్ | 0.32 cr | 
| గుంటూరు | 0.38 cr | 
| కృష్ణా | 0.46 cr | 
| నెల్లూరు | 0.22 cr | 
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.68 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.26 cr | 
| ఓవర్సీస్ | 0.60 cr | 
| వరల్డ్ వైడ్ (టోటల్) | 6.54 cr | 
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రానికి రూ.6.54 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కొరకు రూ.7.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి బజ్ అయితే లేదు. పైగా డ్రై సీజన్లో రిలీజ్ అవుతుంది. స్ట్రాంగ్ మౌత్ టాక్ వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.