ఒకే నెలలో నలుగురు నటీమణులు మృతి..అక్కడ ఏం జరుగుతుంది..!

ఒకే నెలలో 4 మంది నటీమణులు సూసైడ్ చేసుకోవడం సినీ పరిశ్రమకు వణుకు పుట్టిస్తుంది. మే 11న బెంగళూరుకు చెందిన యువ డాన్సర్ టీనా సాధు, మే 12న కేరళకు చెందిన షహనా, మే 16న బెంగాలీ సీరియల్ యాక్ట్రెస్ పల్లవి డే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరో బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ కూడా ఆత్మహత్య చేసుకుని అందరికీ పెద్ద షాకిచ్చింది. బిదిషా డి మజుందార్ వయసు కేవలం 21 సంవత్సరాలు.

ఈమె ఓ మోడల్ అలాగే నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఈమె నివసిస్తూ వచ్చింది. అయితే నిన్న అనూహ్యంగా అదే ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించింది. చనిపోయే ముందు ఆమె సూసైడ్ నోట్ కూడా రాసుకొచ్చింది. బిదిషా 4 నెలలుగా ఈ అపార్ట్మెంట్ లో ఉంటూ వచ్చిందట. మే 25న ఈమె సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్ లెటర్ లో ఏముంది అనే విషయం బయటకి రాలేదు.

బరాక్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. బిదిషా మృతదేహాన్ని, సూసైడ్ లెటర్ ను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. బిదిషా మృతదేహాన్ని ఆర్‌జి కర్ హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. బిదిషాకి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో వచ్చిన మనస్పర్థలు వల్లనే ఈమె సూసైడ్ చేసుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బిదిషా బాయ్ ఫ్రెండ్ పేరు అనుభాబ్ బేరా. ఇతని కారణంగానే ఆమె డిప్రెషన్ కు గురైందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. కాబట్టి ఇతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. బిదిషా కేసు విషయంలో మరిన్ని విషయాలను త్వరలో తెలియజేయనున్నారు పోలీసులు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus