వరుసగా మూడోసారి షూటింగ్‌లో గాయపడిన యంగ్ హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు..

గతకొద్ది రోజులుగా వరుసగా వినిపిస్తున్న దుర్వార్తలతో చిత్ర పరిశ్రమలో అలజడి నెలకొంది. ఏ క్షణాన ఎలాంటి పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుందోనని కంగారు పడుతున్నారు. రీసెంట్‌గా పాపులర్ కోలీవుడ్ యాక్టర్ అరుణ్ విజయ్ ప్రమాదానికి గురయ్యాడని తెలియడంతో తమిళ్ ఇండస్ట్రీ షాక్‌కి గురయ్యింది. అరుణ్ విజయ్.. ప్రముఖ సీనియర్ నటులు మంజుల – విజయ్ కుమార్‌ల కొడుకు.. తక్కువ టైంలోనే తమిళనాట హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలుగులోనూ రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’, ప్రభాస్ ‘సాహో’ వంటి సినిమాలు చేశాడు. ప్రస్తుతం తమిళంలో ‘అచ్చం ఎన్బందు ఇళయే’ మూవీలో నటిస్తున్నాడు. ఎ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు. లండన్‌లో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదానికి గురవడంతో.. ఇండియా తిరిగొచ్చి.. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ తీస్తుండగా.. గతేడాది అక్టోబర్‌లో మోకాలికి, నవంబర్‌లో చేతికి గాయాలయ్యాయి.

‘సాంప్రదాయ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గా అనిపిస్తోంది. త్వరలో తిరిగి షూటింగులో పాల్గొంటాను’ అంటూ ట్రీట్‌మెంట్ జరుగుతున్న ఫోటోను షేర్ చేశాడు అరుణ్ విజయ్..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus