మిడిల్ రేంజ్ హీరోలకు షాకిస్తున్న యంగ్ హీరోలు.. హవా మామూలుగా లేదుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని మిడిల్ రేంజ్ హీరోలలో చాలామంది హీరోలు తమ సినిమాలకు థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే యంగ్ హీరోలు మాత్రం కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) , అడివి శేష్ (Adivi Sesh) రేంజ్ అంతకంతకూ మారుతోంది. ఈ హీరోల పారితోషికాలు సైతం పరిమితంగానే ఉన్నాయి. మిడిల్ రేంజ్ హీరోలకు మించి ఈ హీరోల సినిమాలకు కలెక్షన్లు వస్తున్నాయి.

ఈ హీరోల సక్సెస్ రేట్ సైతం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో కథల పరంగా జాగ్రత్తలు తీసుకునే హీరోలు మాత్రమే సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ముగ్గురు హీరోలు క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. చాలామంది హీరోలు ఇప్పటికీ మూస సినిమాలను తెరకెక్కిస్తూ విమర్శల పాలవుతున్నారు. అలాంటి హీరోలతో పోల్చి చూస్తే ఈ యంగ్ హీరోలు చాలా బెస్ట్ అని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఈ హీరోలు సినిమాలు హిట్టైనా మరీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను పెంచడం లేదు. ఈ హీరోలకు సొంతంగా కథలు రాసే టాలెంట్ కూడా ఉండటం వాళ్లకు మరింత ప్లస్ అవుతోందని తెలుస్తోంది. సిద్ధు, నవీన్, శేష్ టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ నిర్మాతలు సైతం ఈ హీరోలు మినిమం గ్యారంటీ హీరోలు అని చెబుతున్నారు.

ఈ ముగ్గురు హీరోలు కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటూ ఉండటం ఈ హీరోలకు మరింత కలిసొస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తరహా హీరోలే ఇండస్ట్రీని షేక్ చేసే ఛాన్స్ సైతం ఉంటుంది. ఈ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి, అడివి శేష్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus