Akhanda Movie: బాలయ్య సినిమా రిజల్ట్ పై నాని కామెంట్స్!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘అఖండ’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ‘అఖండ’ విడుదలైన ప్రతీచోటా పండగ వాతావరణం కనిపిస్తోంది. సెకండ్ లాక్ డౌన్ తరువాత విడుదలైన అతి పెద్ద సినిమా ఇదే. ఇప్పుడు హిట్ టాక్ రావడంతో ఇండస్ట్రీలో సంబరాలు నెలకొన్నాయి. ‘అఖండ’ సక్సెస్ రాబోయే సినిమాల్లో ఉత్సాహం నింపుతోంది. తాజాగా ‘అఖండ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు యంగ్ హీరోలు రామ్, నాని కూడా స్పందించారు. ‘అఖండ’ చిత్రయూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు. అఖండ గురించి అద్భుతమైన స్పందన వినిపిస్తోందని.. బాలకృష్ణగారు, బోయపాటి గారికి, ద్వారకా క్రియేషన్స్, తమన్, ప్రగ్యాజైస్వాల్ అందరికీ కంగ్రాట్స్ అని హీరో రామ్ చెప్పారు. తెలుగు సినిమా వేవ్ మళ్లీ మొదలైందని రామ్ అన్నారు. నేచురల్ స్టార్ నాని.. ‘బాలకృష్ణగారు గేట్లు తెరిచారని’ పరోక్షంగా థియేటర్ల గురించి మాట్లాడాడు.

‘అఖండ’ టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు. మొత్తానికి బాలయ్య సినిమా దెబ్బకి థియేటర్లలో రచ్చ మాములుగా లేదు. అఘోరా పాత్రను, యాక్షన్స్ సీన్స్ ను బోయపాటి మలిచిన తీరుకి అభిమానులు ఫిదా అయిపోయారు. తమన్ సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus