సుమను అవాక్కయ్యేలా చేసిన యంగ్ హీరోయిన్..?

బుల్లితెర యాంకర్ సుమ యాంకరింగ్ చేసే షోలలో ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షో ఒకటనే సంగతి తెలిసిందే. లేడీ యాంకర్ గా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సుమ క్యాష్ షోతో ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. బుల్లితెరపై ఎక్కువ సంవత్సరాలు ప్రసారమవుతున్న షోలలో సుమ యాంకర్ గా చేసే షోలే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒకవైపు షోలతో బిజీగా ఉన్న సుమ కరోనా ఉధృతి తగ్గడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లతో కూడా బిజీ అవుతున్నారు.

సుమ షోలలో వేసే పంచ్ లు కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి. సౌమ్యంగా ఉంటూనే పంచ్ లు వేసే సుమ యాంకరింగ్ ను అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు. తాజాగా క్యాష్ షో ప్రోమో విడుదల కాగా ఈ షోకు శశి హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ సురభి, రాశీసింగ్, డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు వచ్చారు. సుమ హీరో ఆదిని శశి మూవీ థీమ్ ఏంటి అని అడగగా ఆది ఇంటెన్స్ లవ్ స్టోరీ అని చెబుతాడు.

ఆ ప్రశ్నకు సుమ సమాధానంగా ఇంటెన్స్ లవ్ స్టోరీ అని తనకు కూడా అర్థమవుతుందని ఎందుకంటే మీ డైరెక్టర్ చాలా ఇంటెన్స్ తో చూస్తున్నాడంటూ పంచ్ వేశారు. డైరెక్టర్ శ్రీనివాస్ ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పగా మన చేతుల మీదుగా లాంఛ్ అయిందంటే ఎక్కడికో వెళ్లిపోవాల్సిందే అంటూ మరో పంచ్ వేశారు. ఆ తరువాత మీరు బ్యూటిఫుల్ గా ఉండటానికి ఏం చేస్తుంటారని అడగగా రాశీ సింగ్ మేకప్ అని బదులిచ్చి సుమను అవాక్కయ్యేలా చేశారు.

ఆ తరువాత సుమ సమాధులను చూపిస్తూ లవర్స్ కు ఇంతకంటే ప్రైవసీ ప్లేస్ ఎక్కడా ఉండదని కాటికాపరి తప్ప ఇక్కడ ఎవరూ డిస్టర్బ్ చెయ్యరని చెబుతారు. పార్కులకు వెళ్లి కూర్చుంటే పోలీసులు లేపేస్తారని సమాధుల దగ్గరైతే మనమే లేచిపోవాలని సుమ పంచ్ వేయగా షోలో పాల్గొన్న వాళ్లంతా పకపకా నవ్వుతారు.


చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus