Ravi Teja: రవితేజ సినిమాల్లో ఈ విషయం గమనించారా..!

సీనియర్‌ స్టార్‌ హీరోలతో కుర్ర హీరోయిన్లు నటించడం పెద్ద విషయమేమీ కాదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌… ఇలా ఏ వుడ్‌ అయినా ఇలాంటి కాంబినేషన్లు ఉంటాయి. అయితే వరుసగా అన్ని సినిమాల్లో తన వయసులో సగం ఉన్న హీరోయిన్లతో నటించడం అంటే ఆసక్తికరమే కదా. ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవే ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘ధమాకా’. ఈ మూడు సినిమాల్లోనూ రవితేజ సరసన నటిస్తోంది కుర్ర భామలే.

ముందు రాబోయే రిలీజ్‌ ‘ఖిలాడీ’ గురించి చూద్దాం. ఈ సినిమాలో కథానాయికలుగా మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ నటిస్తున్నారు. ఇద్దరి వయసు 25లోపే. రమేశ్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ఓవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు చేస్తూనే ప్రచారం కూడా చేస్తున్నారు. ముందుగా చెప్పిన లెక్క ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ తేదీకి వస్తుందా? లేక మారుతుందా? అనేది చూడాలి. సినిమాలో కొత్త పాట తీసుకొస్తాం అని ప్రకటించిన నేపథ్యంలో రిలీజ్‌ డేట్‌ పక్కా అనుకోవచ్చు.

ఇక శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ గురించి చూస్తే… ఇందులోనూ ఇద్దరు నాయికలు ఉన్నారు. ఒకరు దివ్యాంశా కౌశిక్‌ అయితే, రెండో ఆమె రజీషా విజయన్‌. రెండో నాయిక వయసు 30 కాగా, తొలి నాయిక వయసు 25లోపే కావడం విశేషం. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. మార్చి 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ఇక త్వరలో షూటింగ్‌ మొదలుకానున్న రెండు సినిమాల సంగతి చూద్దాం. తొలి సినిమా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందనున్న ‘ధమాకా’. ఈ సినిమాలో ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల నటిస్తుందని వార్తలొచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సింది. ఉంది. ఇది కాకుండా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే సినిమా కూడా రవితేజ చేస్తున్నాడు. ఆ సినిమాలో కథానాయికలుగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారని టాక్‌. ఇదీ… రవితేజ సినిమాల్లో కుర్ర హీరోయిన్ల లెక్క.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus