Jr NTR: సినిమాల విషయంలో యంగ్ టైగర్ నిర్ణయమిదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్30, ఎన్టీఆర్31 సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఎన్టీఆర్31 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఎన్టీఆర్32 సినిమా డైరెక్టర్ల జాబితాలో చాలామంది దర్శకులు ఉన్నారు. అయితే ఈ ఛాన్స్ ఏ డైరెక్టర్ కు దక్కుతుందో ఇప్పుడే చెప్పలేం. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రధానంగా ఈ రెండు ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు.

అయితే ఎన్టీఆర్ ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించరని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావాలంటే మరో ఏడాది వరకు ఆగాల్సిందేనని సమాచారం. సినిమాల విషయంలో తారక్ నిర్ణయం ఇదేనని బోగట్టా. ఈ రెండు సినిమాల ఫలితాల విషయంలో సైతం ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా ప్రస్తుతం దిశా పటాని పేరు వినిపిస్తోంది. తెలుగులో దిశా పటానికి పెద్దగా విజయాలు లేకపోయినా బాలీవుడ్ లో దిశా పటాని నటించిన సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ సాధించాయి.

దిశా పటానిని ఈ సినిమాలో ఎంపిక చేస్తారో లేదో చూడాల్సి ఉంది. అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సమస్య మొదలైంది. దీపికా పదుకొనే పేరును పరిశీలించినా ఆమె కూడా ఈ సినిమాకు అంగీకరించలేదని తెలుస్తోంది. కియారా అద్వానీ, దిశా పటాని, రష్మిక, పూజా హెగ్డేలలో ఎవరో ఒకరు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

అతి త్వరలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తారక్ కెరీర్ పరంగా వరుస విజయాలు దక్కేలా జాగ్రత్త పడుతున్నారు. గత కొన్నేళ్లుగా సినిమాసినిమాకు తారక్ రేంజ్, మార్కెట్ పెరుగుతుండటం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus