యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మాస్, క్లాస్ ప్రేక్షకుల్లో అంచనాలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సైతం తారక్ ను అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు. జనతా గ్యారేజ్ తో మలయాళ ప్రేక్షకులకు దగ్గరైన తారక్ ఆర్ఆర్ఆర్ తో హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. తన యాక్టింగ్ తో తారక్ బాలీవుడ్ ఆడియన్స్ ను ఫిదా చేశారనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఆర్మాక్స్ మీడియా సర్వేలో తారక్ నంబర్ 1 స్థానంలో నిలిచారు.
ఏప్రిల్ నెల సర్వేలో తారక్ ఈ అరుదైన ఘనతను సాధించడంతో తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాల విషయంలో సరైన ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. ప్రతిభ ఉన్న దర్శకులకు ఛాన్స్ ఇస్తూనే ఆ సినిమాలతో తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని తారక్ భావిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్ ఇదేనని ఆర్ఆర్ఆర్ ఎక్కువ సమయం షూటింగ్ జరుపుకున్నా కోరుకున్న ఫలితం దక్కిందని తారక్ సంతృప్తితో ఉన్నారని బోగట్టా.
భీమ్ పాత్రలో తారక్ కాకుండా మరే నటుడు నటించినా ఈ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చి ఉండేది కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తారక్ పుట్టినరోజు నుంచి ఆర్ఆర్ఆర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ సినిమాను చూడాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉన్నా తారక్, చరణ్ అభిమానులు మాత్రం ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి సిద్ధంగా ఉన్నారు.
ఎక్కువ టికెట్ రేట్లు ఉండటం వల్ల థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను ఒకసారి మాత్రమే చూశామని ఓటీటీలో మాత్రం మళ్లీమళ్లీ చూస్తామని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి మొదలుకానుంది. రష్మిక తారక్ కు జోడీగా నటించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదనే సంగతి తెలిసిందే. అనుకున్న లక్ష్యాన్ని తారక్ చేధిస్తారో లేదో చూడాల్సి ఉంది.