Vijay: ఆ పాట చూడాలంటే ఓసారి ఆలోచించుకోండి!

‘మాస్టర్‌’ సినిమాలోని ‘క్విట్‌ పన్నుడా..’ అనే పాట గుర్తుందా? తెలుగులో ‘క్విట్‌ చేయరా..’ అని ఉంటుంది. సినిమాలో కీలకమైన సమయంలో ఈ పాట వస్తుంది. ఇప్పటికే సినిమా చూసినవాళ్లకు ఈ పాట బాగా పరిచయమే. అనుకోని పరిస్థితుల్లో తాగుడుకు అలవాటుపడిపోయి, సమాజంతో, పరిసరాలతో పట్టింపు లేకుండా ఉంటాడు. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటనతో మారిపోతాడు. ఈ క్రమంలో పైన చెప్పిన ‘క్వట్‌ పన్నుడా..’ / ‘క్విట్‌ చేయరా..’ అనే పాట వస్తుంది.

ఆ పాటకు సినిమాలో మంచి అప్లాజ్‌ వస్తుంది. విజయ్‌ నటన పాటలో అదిరిపోతుంది అని చెప్పొచ్చు. పాట యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన వెంటనే తెగ చూశారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు ఆ పాటను యూట్యూబ్‌లో చూద్దాం అంటే.. ఒక పట్టాన ప్లే అవ్వదు. తమిళంలో ఉన్న ఆ పాట గురించి యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి లిస్ట్‌లో పాట కనిపిస్తోంది. అయితే.. క్లిక్‌ చేసి ప్లే చేద్దామని చూస్తే మాత్రం షాక్‌ తగులుతుంది. అదేంటంటారా? The following content may contain topics related to suicide or self-harm.

సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే… ఈ పాటలో ఇబ్బంది పెట్టే విజువల్స్‌ ఉన్నాయి. ఆత్మహత్యకు సంబంధించిన విజువల్స్‌ కూడా ఉన్నాయి అని యూట్యూబ్‌ ఓ హెచ్చరిక వస్తుంది. అలాంటి వీడియోను మేం చూడటానికి సంసిద్ధంగా ఉన్నాం. నాకు మీరు చెప్పిన విషయం అర్థమైంది అని క్లిక్‌ చేస్తేనే.. అప్పుడు పాట ప్లే అవుతుంది. పాటలో అలాంటి సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి. అయితే అంతోకోంత మార్ఫ్‌లు చేసి చూపించాల్సింది కానీ అలానే ఉంచేయడంతో ఇప్పుడు యూట్యూబ్‌ షాక్‌ ఇచ్చింది.

సినిమాలో ఆ పాట విజయ్‌లో ఎంత మార్పు తీసుకొస్తుందో చూశారు. అంత భావోద్వేగంగా ఆ పాట సాగుతుంది. అలాంటి పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ఈజీగా చూసే అవకాశం లేకపోవడం ఇబ్బందిగా మారింది. మరి సినిమా టీమ్‌ లేదంటే యూట్యూబ్‌ ఛానల్‌ రెస్పాండ్‌ అయ్యి మార్పులు చేస్తూ ఫ్యాన్స్‌ ఈజీగా ఆ వీడియోను చూసి ఎంజాయ్‌ చేయొచ్చు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus