సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక ఒక సాహిత్య పరిశోధకుడు అలియాస్ సైంటిస్ట్: వై. వి. ఎస్‌. చౌదరి

  • December 1, 2021 / 03:41 PM IST

తాను చదువుకున్న అనంతమైన సాహిత్యపు సారాన్ని మరియూ జీవితం పట్ల తనకున్న అపారమైన అవగాహనని మేళవించి.. రాసే ప్రతిపదం వెనుక ఎంతో గాఢమైన, లోతైన సారాన్ని, జ్ఞానాన్ని సందర్భోచితంగా నింపుతూ.. ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ.. పండితులను పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు (Lyrical Scientist) అయిన ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం.

ఆయనతో, ఆయన బిడ్డలతో (పాటలతో) మరియూ ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం కలగటం నేను చేసుకున్న అదృష్టం. నా దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘సీతారామరాజు’ మరియూ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలలోని అన్ని పాటలను Solo/Single Card Lyricist గా.. ఆయనతో రాయించుకోగలిగిన అనుభవాన్ని పొందగలగటం.. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన పాటల రూపంలో తెలుగు సాహిత్య ప్రియుల మధ్య ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారని విశ్వసిస్తూ..

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus