స్టార్ హీరోయిన్ రష్మిక మార్ఫింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అందరూ ఈ చర్యను ఖండించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఐటీశాఖ నుంచి అమితాబ్, నాగచైతన్య వరకూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, నిందితులను శిక్షించాలని కోరారు. ఈ ఘటన తననెంతో భయపెట్టిందని రష్మిక కూడా బాధపడ్డారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబసభ్యులు, స్నేహితులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఈ క్రమంలో ఒరిజినల్ వీడియో క్లిప్‌లో ఉన్న జరా పటేల్ కూడా స్పందించారు.
జరిగిన దానికి చింతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీని ఉపయోగించి నా శరీరానికి ప్రముఖ బాలీవుడ్ నటి ముఖాన్ని జోడించిన వీడియో వైరల్ కావడం నా దృష్టికి కూడా వచ్చింది. ఈ విషయంలో నా ప్రమేయం ఎంత మాత్రమూ లేదు. జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నా. మహిళలు, చిన్నారుల భవిష్యత్ ఏమవుతుందోనని నాకు ఆందోళనగా ఉంది.
ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఏది పంచుకోవాలన్నా భయంగా ఉంది. ఇలాంటి వాటిని దయచేసి ప్రోత్సహించవద్దు. ఇంటర్నెట్‌లో వచ్చే ప్రతి దాని విషయంలో నిజ నిర్ధారణ కూడా అవసరం. మనం ఇంటర్నెట్‌లో చూసేది ఏదీ నిజం కాదు’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో జరా పటేల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆమె (Rashmika) చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీ జరా పటేల్ అంటే.. బ్రిటిష్ ఇండియన్. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె ఖాతాను 4లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. డేటా ఇంజినీర్‌గా, మెంటల్ హెల్త్ అడ్వొకేట్‌గా పనిచేస్తున్నట్లు ఆమె బయోలో పేర్కొన్నారు.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!