షాకిస్తున్న ‘జాంబీ రెడ్డి’ హిందీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్..!

‘అ!’ ‘కల్కి’ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతున్న 3వ చిత్రం ‘జాంబీ రెడ్డి’. తెలుగులో రాబోతున్న మొట్ట మొదటి జాంబీ చిత్రం ఇదని ట్రైలర్ లో చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ థీమ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. నిజానికి కరోనా పాండమిక్ సిట్యుయేషన్ మొదలు కాకముందే ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్.సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నాడు కానీ.. అప్పుడు థియేటర్ల సమస్య ఏర్పడడంతో ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు.

ఈ మధ్యనే ప్రచారంలో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి కూడా మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది ఈ ట్రైలర్ బాగుంది అన్నారు.. మరికొంత మంది బాలేదు అన్నారు. అయితే ఈ చిత్రానికి హిందీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ మాత్రం బాగా జరిగింది. అందుతోన్న సమాచారం ప్రకారం.. ‘జాంబీ రెడ్డి’ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 2.3కోట్లకు అమ్ముడుపోయాయట. మన తెలుగు చిత్రాలకు ఈ మధ్యన అక్కడ మంచి డిమాండ్ ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా అంత పెద్ద మొత్తం పెట్టి అక్కడి ఛానెల్స్ వారు దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి బడ్జెట్ కూడా 2కోట్లు మాత్రమే అయ్యిందనేది ఇన్సైడ్ టాక్. దానిని బట్టి చూసుకుంటే.. ఇక థియేట్రికల్ మరియు శాటిలైట్ రైట్స్ పరంగా వచ్చే మొత్తం నిర్మాతలు లాభాలనే చెప్పాలి. ఏమైనా సినిమా విడుదల కాకుండానే లాభాలు బాట పట్టడమంటే మామూలు విషయం కాదు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!
ఆ హీరోలు వద్దంటే.. విజయ్ – బన్నీ ఒప్పుకున్నారట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus